టర్కీ, సిరియాలలో వరుస భూప్రకంపనలు.. పెను భూకంపం ధాటికి 3,400 మందికి పైగా మృతి.. టర్కీలో భూపంకం ధాటికి 2,316 మంది మృతి.. సిరియాలో భూకంపం ధాటికి 1,106 మంది మృతి.. వేల సంఖ్యలో కూలిన భవనాలు దర్శనం ఇస్తున్నాయి. ఈ విపత్తు నుంచి టర్కీ, సిరియా ఎప్పుడు బయటపడతాయో. టర్కీ భూకంపంలో 4 వేలు దాటిన మృతుల సంఖ్య.. వరుస ప్రకంపనలతో పేకమేడల్లా కూలిన భారీ అపార్ట్‌మెంట్లు.. మొత్తం 5,600కు పైగా కూలిపోయిన బహుళ అంతస్తుల భవనాలు.. శిథిలాల కింద వేల మంది చిక్కుకున్నట్లు అంచనా.. కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి సహాయక బృందాలు. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన వాతావరణ పరిస్థితులు.. సున్నా డిగ్రీల చలిలో వణికిపోతున్న భూకంప బాధితులు.. పాలిథిన్ కవర్లు కప్పుకుని, చలి మంటలు వేసుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు బాధితులు.
వరుస ప్రకంపనల కారణంగా సురక్షిత ప్రాంతాలకు భారీగా తరలిపోతున్నారు జనం. ఒక్కసారిగా రోడ్లన్నీ వాహనాలతో నిండిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్‌లు.. ట్రాఫిక్ జామ్ వల్ల సకాలంలో శిథిలా దగ్గరికి చేరుకోలేకపోతున్న సహాయక బృందాలు.. సహాయక చర్యలు ఆలస్యం అయ్యేకొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.