కుప్పకూలిన సుఖోయ్-30, మిరాజ్‌ 2000 యుద్ధవిమానాలు

0
415

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. శిక్షణ, విన్యాసాలు చేస్తున్న సమయంలో మొరెనాలో సుఖోయ్-30, మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్వాలియర్‌లోని ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన యుద్ధవిమానాలు ఒకదానికొకటి ఢీకొని కూలినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం తర్వాత రెండు యుద్ధ విమానాల్లో మంటలు చెలరేగి కాలిపోయినట్లు సమాచారం.

రోజు వారి ప్రాక్టీస్‌లో భాగంగా నింగిలోకి దూసుకెళ్లిన విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రెండు విమానాల్లోని పైలెట్లకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ప్రమాద స్థలానికి ఐఏఎఫ్ రెస్క్యూ బృందం చేరుకుని చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై రక్షణ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై చీఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్, ఏయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. పైలెట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here