కేసీఆర్‌ నోటి నుండి వస్తే అమృత పదాలా?

0
101

కేసీఆర్‌ నోటి నుండి వస్తే అమృత పదాలా? అంటూ ఫైర్‌ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. కేసీఆర్‌ ఆర్ నీ మించిన ఫాసిస్ట్, నియంత, అప్రజాస్వామిక, అహంకార వాది మరొకరు లేరని మండిపడ్డారు. ఆయనకున్న అధికార దాహం మరొకరికి లేదని విమర్శించారు. మోడీ నీ గద్దె దించుతాడు అట… ఉన్న ఎనిమిది సీట్లు కూడా వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఉద్చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్‌ రెడ్డి. వినాశ కాలే విపరీత బుద్ది అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి ప్రజలు ఎప్పుడు అండగా నిలబడలేదని అన్నారు.శాసన సభ లోపల అన్ పార్లమెంటరీ పదాలు వాడుతున్నారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ ని శాసన సభకు రానియ్యను, ఆయన ముఖం చూడను అంటున్న నీ కన్నా పాసిస్ట్ ఎవరు కేసీఆర్‌ అంటూ మండిపడ్డారు.

ఈటల రాజేందర్ ని చూడడం ఇష్టం లేక పోతే మీరు అసెంబ్లీ కు రాకండి కేసీఆర్‌ అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వ్యక్తి ఈటల అని గుర్తుచేశారు. ఈటెలరాజేందర్ ని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటెల వ్యాపారాన్ని, ఆస్తులను, కుటుంబాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీ జాగీరా కేసీఆర్… నువేమన్న నిజాం వా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హుజూరబాద్ ప్రజల తీర్పును కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ శాసన సభలో ఎవరినైనా సస్పెండ్ చేయాలి అంటే కేసీఆర్‌ నే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నీ శాస్వతంగా సభ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ నోటి నుండి వస్తె అమృత పదాలా అని మండిపడ్డారు కిషన్‌ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here