భర్తపై మీద కోపంతో.. మామ మర్మాంగాలను కోసిన కోడలు..

0
125

కన్నవారింటికి వెళ్లొద్దన్నారనే కోపంతో దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ. మామ మర్మాంగాలను కోసిపడేసింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లోని మైనా జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పు పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన శిఖా అనే మహిళకు వివాహం అయింది. భర్త, అత్తామామలతో కలిసి ఉంటోంది. అయితే ఒక రోజు ఆమెకు తండ్రి ఫోన్ చేసి.. ఇంట్లో మాంసాహారం వండామని భోజనం చేసేందుకు రమ్మని పిలిచాడు. దీనితో ఆమె తన భర్తకు ఫోన్‌ చేసి విషయం తెలిపింది. అతను వెళ్లొద్దని చెప్పాడు. తానే చికెన్‌ తెస్తానని ఇంట్లోనే వండుకుని తిందామని తెలిపాడు. కాల్‌ కట్‌ చేసిన తర్వాత మహిళ.. కోపంతో తన అత్తమామలతో గొడవపడింది. వారిని తీవ్రంగా దూషించింది. ఇది కాస్తా వాగ్వాదానికి దారి తీసింది.

అత్తామామల్ని తీవ్రంగా దూషించిన కోడలు.. కోపంతో ఊగిపోయింది. విచక్షణ కోల్పోయి తన మామ మర్మాంగాన్ని కత్తితో కోసి పడేసింది. ఈ గొడవతో అక్కడికి చేరుకున్న స్థానికులు.. నొప్పితో విలవిలలాడుతున్న వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు సదరు మహిళను బంధించగా.. ఆమె విడిపించుకుని పుట్టింటికి పారిపోయింది. అనంతరం బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 14రోజుల కస్టడీ విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here