వివాహేతర సంబంధం మోజులో ప్రియుడితో కలిసి..

0
49

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్ని కాపురాలు కూలిపోయాయో అందరికీ తెలుసు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. రెండు నిమిషాల మోజు కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తమ పచ్చని సంసారాల్ని తామే నిప్పు పెట్టేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ కూడా ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని, తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో పడి తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది. చివరికి కటకటాలపాలైంది. కర్ణాటక బెంగళూరులోని యెళహంకలో ఈ దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి యెళహంకలోని లేఔట్‌లో ఓ భవనంపై చంద్రశేఖర్‌(35) అనే కార్మికుడు తల, మర్మాంగాలపై గాయాలతో హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాలోని హిందూపురానికి చెందిన చంద్రశేఖర్‌కు శ్వేత(19) అనే యువతితో 4 ఏళ్ల క్రితం వివాహం అయింది. శ్వేత చంద్రశేఖర్‌కు సొంత అక్కకూతురు. చంద్రశేఖర్‌ కంటే శ్వేత 16 ఏళ్లు చిన్నది. అక్క కూతురు అనే కారణంతో ఇద్దరికి బలవంతంగా వివాహం జరిపించారు. పెళ్లైన తర్వాత శ్వేత కాలేజీకి వెళ్లేది. కాలేజీలో శ్వేతకు కొందరు యువకులతో స్నేహం ఏర్పడింది. అక్కడ స్నేహితులతో కలిసి షికార్లకు వెళ్లేదని చంద్రశేఖర్‌ ఆమెతో తరచూ గొడవపడేవాడు. దీంతో కుటుంబసభ్యులు 4 నెలల కిందటే దంపతుల మధ్య రాజీ చేసి హిందూపురం నుంచి యెళహంక కొండప్ప లేఔట్‌లో ఉండాలని ఇక్కడకు పంపించారు. శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్‌తో సంబంధం కొనసాగిస్తోంది. సురేశ్‌ అప్పుడప్పుడు శ్వేత ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఆమె భర్తకు తెలియకుండా ఈ తతంగం సాగుతోంది. చివరికి ఈ విషయం భర్తకు తెలియడంతో మళ్లీ ఘర్షణ పడ్డారు.

ఈ క్రమంలో శ్వేత తన ప్రియుడితో కలిసి చంద్రశేఖర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. చంద్రశేఖర్‌ను అంతమొందించాలనే పక్కా ప్రణాళికతో సురేష్ అక్టోబరు 22న సురేశ్.. బెంగళూరు వచ్చాడు. చంద్రశేఖర్‌ ఇంట్లోనే ఉన్నాడని, ఇదే సరైన సమయమని శ్వేత ఫోన్‌ చేసింది. సురేశ్‌ వచ్చి చంద్రశేఖర్‌ను కలిశాడు, మీతో మాట్లాడాలంటూ మేడపైకి తీసుకెళ్లి గొడవపడ్డాడు. సురేశ్‌ పక్కనే ఉన్న ఇటుక తీసుకుని చంద్రశేఖర్‌ తలపై దాడిచేశాడు. దీంతో చంద్రశేఖర్ తీవ్ర రక్తస్రావమై కింద పడిపోయాడు. అనంతరం సురేశ్​.. చంద్రశేఖర్ జననాంగాలను కోసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. భర్త హత్య జరిగిన సమయంలో భార్య శ్వేత ఇంట్లోనే ఉన్నా ఏమి తెలియనట్లు నటించింది. భర్త మరణాంతరం కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరు హత్య చేశారు అని భార్యను ప్రశ్నించగా తనకు తెలియదని, ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారని పొంతన లేకుండా సమాధానం చెప్పింది. ఆమెపై అనుమానంతో పీఎస్‌కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా ప్రియుడు సురేశ్‌తో కలిసి హత్య చేసినట్లు నిజాలను బయటపెట్టింది. వారిద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here