తమ్ముడు చిత్రంలో హంస నడకతో హొయలుగొలిపిన హీరోయిన్ ప్రీతి జింగానియా.. ప్రేక్షకులకి గుర్తుండే ఉంటుంది.. ఈమె తమ్ముడు సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది.. ఈ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. దీనితో ఆమె తెలుగులో వరస అవకాశాలను ఆదిపుచ్చుకుంది.. దాదాపు అగ్రహీరోలందరి సరసన నట్టించింది.. బాలకృష్ణ, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నట్టించింది.. తెలుగు లోనే కాదు వేరే భాషల్లోనూ నటించి నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది..
కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే పర్విన్ దబ్బాస్‌ని ప్రేమించి పెళ్లాడింది. వివాహం అయిన తరువాత సినిమాలకి విరామం ఇచ్చిన ఆమె.. ఆ తరువాత ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి కుటుంభం బాధ్యతలతో చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరం అయ్యింది..
అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో ఆక్టివ్ గ ఉంటూ తనకి సంబంధించిన విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇస్తూ ఉంటుంది.. ఫిట్నెస్ పరంగా అప్పటికి ఇప్పటికి ఒకలానే ఉన్నప్పటికీ తమ్ముడు సినిమా లో ఉన్న కల ఇప్పుడు ఆమె మొఖంలో లేదు.. వివాహం అయ్యాక మహిళల్లో మార్పులు వస్తాయి అనడానికి ప్రీతి జింగానియా ఒక ఉదాహరణ.. అయినా ఈ వయసులోనూ ఫిట్ గా ఉన్నదంటే అభినందదాయకం.. ఇక ఈ మధ్యనే ఆమె కఫాస్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. మరి ముందు ముందు ఈ భామ తెలుగులో కూడా ఏమైనా అడుగుపెడుతుందేమో చూడాలి.