China Bubonic Plague: రోగాల అడ్డ.. చైనాగడ్డ.. బయటపడిన బుబోనిక్ ప్లేగు వ్యాధి

0
45

చైనా.. ఏమైనా చేయగలదు.. దేన్నైనా శృంష్టించగలదు.. కాని చైనా వాళ్ళ సృష్టి నలుగురికి మేలు చేసేలా కాదు నాశనం చేసేలా ఉంటుంది.. తను నాశనం అయ్యేదే కాదు తనతో పాటు అందరి వినాశనాన్ని కోరుకుంటుంది.. నాకు ఒక్క కన్ను పోతే పక్కనోళ్ళకి రెండు కళ్ళు పోవాలి అనుకునే రకం చైనా..

ఆ చైనా మేధావుల అతి తెలివికి నిధర్శనమే కరోనా వైరస్‌ కోవిడ్‌-19 వైరస్‌.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వైరస్ ఈ మహానుభావుల మేధాస్సునుండే ఆవిర్భవించింది.. సర్లే అదేదో పీడకలని మర్చిపోతుంటే ఇంతలో మరో ప్రాణాంతకమైన వ్యాధి చైనాలో ప్రబలుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు సైతం ఆ దేశంలో నమోదైనట్టు అధికారికంగా ప్రటించారు.

. చైనాకి ఉత్తర ప్రాంతంలో ఇన్నర్ మంగోలియాలో బుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబలుతోంది. అయితే ఇదేమీ కొత్త వ్యాధేమీ కాదు. కాకపోతే.. కొత్తగా వ్యాపిస్తోంది.. చైనా అధీనంలోని ఇన్నర్ మంగోలియాలో ఈ వ్యాధి ఇప్పటికే ఇద్దరికి సోకింది శనివారం అధికారులు ప్రకటించారు.

ఈ వ్యాధి ఆగస్టు 7న మొదలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఓ తండ్రి, కూతురికి ఈ వ్యాధి సోకడంతో.. వారికి టెస్టులు చేసి.. శనివారం నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వ్యాధి సోకిన వారితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారందర్నీ పిలిపించి టెస్టులు చేశారు. ఎవరిలోనూ అసాధారణ లక్షణాలేవీ కనిపించలేదని ఓ స్టేట్‌మెంట్‌లో అధికారులు ప్రకటించారు.

డాక్టర్ల ప్రకారం.. బుబోనిక్ ప్లేగు అనేది.. చాలా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. దీన్ని బ్లాక్ డెత్ వ్యాధి అని కూడా అంటారు. ముక్యంగ ఈ వ్యాధి ఆఫ్రిక ఖండంలో ఎక్కువగా వస్తుంది.. ఆఫ్రికన్స్ ఎక్కువగా ఈ వ్యాధి వల్ల చనిపోతుంటారు అందుకే దీన్ని ఆ పేరుతో పిలుస్తారు.. ఇది ఎలుకలు, చుంచెలుకలు, పందికొక్కులు ద్వారా, వాటి వ్యర్థాల నుంచి వ్యాపిస్తుంది. అవి తినగా వదిలేసిన ఆహారం నుంచి వ్యాపిస్తుంది..

ఈ కేసులు చైనాలో తక్కువే. కానీ ఈమధ్య కొన్నేళ్లుగా ఇన్నర్ మంగోలియా, వాయవ్య నింజియా ప్రాంతంలో ఇలాంటి కేసులు తరచూ వస్తున్నట్టు ప్రకటించారు. ప్లేగు వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఈ బుబోనిక్ ప్లేగు. ఇది సోకిన వారికి తగిన సమయంలో ట్రీట్‌మెంట్ చెయ్యకపోతే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది.

బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకి వారి శరీరంలోకి ప్లేగ్ బ్యాసిల్లస్, వై.పెస్టిస్ అనే సూక్ష్మజీవులు ఎంటర్ అవుతాయి. ఆ తర్వాత వాటి సంఖ్యను పెంచుకుంటాయి. ఈ బుబోనిక్‌ ప్లేగు వ్యాధి మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశాలు తక్కువ. ఇందులో కూడా.. నిమోనిక్ ప్లేగు అనేది అత్యంత ప్రమాదకరమైనదని.. అది ఊపిరి తిత్తులకు వ్యాపించి.. ప్రాణం తీసేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here