కాంట్రాక్ట్‌ వెడ్డింగ్‌.. పిచ్చ క్లారిటీ ఉంది..! కానీ, సాధ్యమేనా..?

0
102

పెళ్లి తర్వాత అలా ఉండాలి..! ఇలా ఉండాల్సిందే..! ఈ పని నువ్వు చేయి..! ఈ పని నేను చేస్తా..! లాంటి విషయాల్లో వారి అభిప్రాయాలు కుదిరే వారకు కొన్ని విషయాల్లో గొడవలు జరిగిన సందర్భాలు ఉంటాయి.. అయితే, ఆ రిస్క్‌ ఎందుకు..? ముందే.. ఏం చేయాలి..? ఎలా ఉండాలి..? ఏం తినాలి..? లాంటి విషయాలపై ఓ జంట క్లారిటీకి వచ్చింది.. దానినే ఓ ఒప్పంద పత్రంపై పెట్టింది.. పెళ్లి అయిన తర్వాత వధువు, వరుడు వాటిపై సంతకాలు కూడా చేశారు.. ఇక, ఏది కాస్త కొత్తగా, వింతగా కనిపించినా.. షేర్లు, కామెంట్లతో వైరల్‌ చేయడానికి మన నెటిజన్లు ఉండేఉన్నారుగా.. ఇప్పుడా ఆ వ్యవహారంలో నెటింట్లో తెగ చక్కర్లు కొడుతోంది..

కాంట్రాక్ట్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా జరిగిన ఓపెళ్లి, ఆ సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.. అసోంకు చెందిన శాంతి మరియు మింటు.. పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి తర్వాత ఏం చేయాలి మరియు ఏం చేయకూడదో ఓ జాబితా తయారు చేశారు.. దానిపై ఇద్దరూ సంతకం చేశారు.. వెడ్‌లాక్ ఫోటోగ్రఫీ అసోం ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన దీనికి సంబంధించిన క్లిప్‌.. వైరల్‌ అవుతోంది.. తాము చేసుకున్న ఒప్పందాన్ని పెద్ద కాగితంపై ముద్రించారు.. దానిపై సంతకం చేసింది ఆ కొత్త జంట.. ఒప్పందం ప్రకారం, వధువు ప్రతిరోజూ చీరను ధరించాలి, అర్థరాత్రి పార్టీలు జీవిత భాగస్వామితో మాత్రమే వెళ్లాలి, ఆదివారం ఉదయం అల్పాహారం తుమ్ బానోగే అని కూడా రాసుకున్నారు.. నెలకు ఒకసారి పిజ్జా తినాలి, ఇంట్లో వంటనే మనం తినాలి.. అయితే, ఎవరు వంట చేయాలనే విషయాన్ని ప్రస్తావించలేదు, ఇద్దరం ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి, పార్టీలో మంచి మంచి ఫొటోస్ దిగాలి, ప్రతి 15 రోజుల తర్వాత షాపింగ్ చేయాలి వంటివి చేర్చారు.. అయితే, ఈ వివాహ ఒప్పందాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు.. మరికొందరు విసుగు చెందుతున్నారు.. ఆ ఫొటోలు, వీడియోలు షేర్‌ చూస్తూనే.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. భాయ్, ఇది వివాహం కాదు ఇది ఒప్పందం అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెడితే.. అన్ని షరతులు సరే.. కానీ, రోజువారీ చీర చాలా ఎక్కువ అని మరొకరు.. భారతదేశంలో ఇప్పటికీ చాలా అసమానతలు ఉన్నందుకు చాలా విచారంగా ఉంది అంటూ మరొకరు.. ఇలా కామెంట్లు పెడుతున్నారు.. మొత్తంగా.. రొటీన్‌కి భిన్నంగా జరిగిన ఈ ఒప్పంద పెళ్లి.. సోషల్ మీడియా రచ్చోరచ్చగా మారిపోయింది. ఏం చేయాలనేదానిపై క్లారిటీ బాగానే ఉంది.. మరి ఇవి పాటిస్తూ ఆ జంట ముందుకు సాగుతుందా..? ఒప్పందానికి తూట్లు పొడుస్తారా? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here