గ్రాండ్‌గా శునకం బర్త్‌ డే.. ఎందుకో తెలిస్తే షాకే..!

0
128

ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క బర్త్‌ డేను గ్రాండ్‌గా చేశాడు.. అసలే ఓ పొలిటికల్‌ డ్రామా ఉంది.. కుక్క బర్త్‌ డే చేసి రివేంజ్‌ తరహా డ్రామా ప్లాన్‌ చేశాడు.. దీంతో, కుక్క బర్త్‌డేను ఘనంగా నిర్వహించాడు.. ఊరు ఊరంతా పిలిచాడు.. 100 కిలోల కేట్‌ కట్‌ చేశాడు.. భోజనాలు పెట్టించాడు.. కర్ణాటకలో జరిగిన కుక్క బర్త్‌డే పార్టీ, దాని వెనుక పొలిటికల్‌ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శివప్పబెళగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి… ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.. దానికి ‘క్రిష్’ అని పేరు పెట్టుకున్నాడు.. క్రిష్‌ బర్త్‌ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాడు.. గ్రామంలోని దాదాపు 5 వేల మందిని పిలిచి మంచి భోజనం వడ్డించాడు.. శునకం పుట్టినరోజు వేడుకల్లో వంద కిలోల కేక్‌ కట్‌ చేయడమే కాదు.. 300 కిలోల మటన్‌, పెద్ద సంఖ్యలో గుడ్లను తెప్పించాడు.. నాజ్‌ వెజ్‌ ప్రియులకు నాన్‌వెజ్‌… వెజ్‌ తినేవారి కోసం ప్రత్యేకంగా కూరగాయలను తెప్పించి భోజన ఏర్పాట్లు చేశారు.

ఇక, కేక్ కట్ చేసిన తర్వాత కుక్కను వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు.. గ్రామంలోని ప్రజలందరూ దానికి నమస్కరించారు. అయితే, క్రిష్‌పై శివప్ప మర్డికి ప్రేమ ఉన్నా.. పార్టీ వెనుక మాత్రం.. చిన్న పొలిటికల్‌ టచ్‌ ఉంది.. అదేంటి అంటే.. శివప్ప మర్డి గత 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు.. ఓ సారి కొత్త పంచాయతీ సభ్యుడు తన పుట్టిన రోజు పార్టీ ఇచ్చాడట.. ఆ సందర్భంగా పాత పంచాయతీ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. మా హయాంలో పాత పంచాయతీ సభ్యులు వచ్చి కుక్కల్లా తిన్నారని కించపర్చే వ్యాఖ్యలు చేశాడట.. ఆ మాటలతో నొచ్చుకున్న శిప్ప మర్డి.. తన పెంపుడు కుక్క పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించి.. ఐదు వేల మందిని పిలిచి భోజనాలు పెట్టి ఔరా! అనిపించారు.. మొత్తంగా ఈ న్యూస్‌, ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here