ఐదేళ్లుగా పెళ్లికోసం ప్రయత్నాలు.. చివరకు ఓ ఐడియా తట్టింది..!

0
1104

జీవితంలో సెటిల్‌ అయినా పెళ్లి కాని ప్రసాద్‌లు ఎంతో మంది ఉన్నారు.. వారు పెళ్లి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కొందరికి తగిన పిల్ల దొరకడం లేదు.. అలాంటి పరిస్థితే ఓ యువకుడికి ఎదురైంది.. ఓ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ మంచి జీతం పొందుతున్న 27 ఏళ్ల యువకుడుకి పెళ్లిపై మనసైంది.. తగిన జోడు కోసం బాగానే ప్రయత్నాలు చేశాడట.. అయినా.. ఎవరూ దొరకకపోవడంతో.. అతడికి ఓ ఐడియా వచ్చింది.. దాంతో.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్‌ నంబర్‌ , ఫొటో, అడ్రస్.. ఇలా అన్నీ పొందుపరుస్తూ.. ఓ పోస్టర్‌ను డిజైన్‌ చేయించాడు.. ప్రింట్‌ వేయించి అక్కడక్క అంటించాడు.. ఇప్పుడా పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..

పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని మదురైలో భార్య కావాలంటూ ఎక్కడా చూసినా పోస్టర్లు దర్శమనిస్తున్నాయి.. మదురైలో ఉంటున్న 27 ఏళ్ల జగన్.. ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడట.. ఇక, పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన జగన్‌.. ఐదేళ్లుగా తనకు కాబోయే జీవిత భాగస్వామి కోసం వెతకడం మొదలు పెట్టాడట.. అయినా.. అతడి ప్రయత్నాలు ఫలించలేదు.. దీంతో, అతడికి ఓ ఐడియా తట్టింది.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలన్నీ వెల్లడిస్తూ.. తన ఫొటో కూడా వచ్చేలా చూసుకుంటూ.. ఓ పోస్టర్‌ రూపొదించాడు.. కంపెనీ పేరు, తనకు నెలకు రూ.40 వేల జీతం వస్తుందనే వివరాలు.. అన్నీ పొందుపర్చాడు.. గతంలో డిజైనర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో.. అతడి బుర్రకు ఈ ఐడియా తట్టిందట.. వెంటనే వాటిని ప్రింట్‌ వేయించి.. మదురైతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అంటించాడు.. ఇప్పుడా పోస్టర్లు తమిళనాడులో వైరల్‌గా మారాయి.. మరి ఈ ప్రయత్నమైనా ఫలించి పెళ్లి అవుతుందేమో చూడాలి మన జగన్‌కు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here