Tinder: డేటింగ్ యాప్‌లో చెల్లెళ్ల కోసం వెతికాడు..

0
41

Tinder: సాధారణంగా ప్రేమ, సాంగత్యం కోసం టిండర్‌ అనే డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తుండగా.. ఓ వ్యక్తి రక్షా బంధన్‌ కోసం చెల్లెళ్లను వెతుక్కోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించాడు. నిజమేనండి.. అతనికి ఇద్దరు సోదరీమణులు కూడా దొరికారు. అతనే స్వయంగా సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు రాఖీ పండుగను ఆస్వాదించాలనుకున్నాడు. కానీ తనకు సొంత అక్కాచెల్లెళ్లు లేరు. దాంతో ఏం చేయాలని బాగా ఆలోచించాడు. వెంటనే బుర్రలోకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. డేటింగ్ యాప్‌ అయిన టిండర్‌లో సెర్చింగ్ మొదలుపెట్టాడు. తనకు మంచి సోదరిగా మెలిగే వ్యక్తి కోసం వెదికాడు. ఇంకేముంది అతనికి ఇద్దరి అమ్మాయిలు దొరికేశారు. దీంతో రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ఆ వ్యక్తి రెడీ అయిపోయాడు. అతనే సోషల్‌ మీడియాలో ఈ విధంగా వెల్లడించాడు. రక్షాబంధన్ సందర్భంగా తను మంచి సోదరి కోసం వెదికానని చెప్పాడు. తనకు రాఖీ కట్టడానికి .. గిఫ్ట్‌లు ఇవ్వడానికి ఎవరూ లేరని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది టిండర్‌లో చెల్లెళ్లు కోసం వెదికానని, ఇద్దరు దొరికారని .. ఇక రాఖీ పండుగ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. వారితో రాఖీ పండుగను జరుపుకోబోతున్నట్టు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆ యువకుడు టిండర్ యాప్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. అయితే దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

గతంలో కూడా ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ డేటింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో ఒక వ్యక్తి అద్దెకి ఫ్లాట్‌ను వెదికాడు. ముంబైలో ఫ్లాట్ కోసం చూస్తున్నానని సంబంధిత యాప్ బయోలో రాశాడు. అంతేకాదు. “మీరు ముంబైలో ఉంటే కుడివైపుకి స్వైప్ చేయండి. నాకు హిందీ తెలియదు కాబట్టి వెస్ట్రన్ లైన్‌లో అద్దెకు ఫ్లాట్‌ను కనుగొనడంలో నాకు సాయం చేయండి.” అని రాశాడు. మరీ ఆయన ప్రయత్నాలు ఫలించాయో లేదో తెలియదు.. అప్పట్లో ఈ వార్త ట్రెండ్ అయింది. దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here