Viral News: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. 45 రోజుల తర్వాత మతి పోగొట్టింది

0
110

ప్రేమించిన వాళ్ల కోసం అబ్బాయిలు/అమ్మాయిలు ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఇంట్లో వాళ్లని కాదనుకొని, ప్రేమించిన వారితో వెళ్లిపోతుంటారు. అయితే, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఓ అమ్మాయి.. చివరికి ప్రియుడ్ని నట్టేట ముంచి పరారైంది. ఈ ఘటన పాట్నాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

పాట్నాలో ఉంటోన్న ఓ అమ్మాయికి ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమలో మునిగిపోయారు. ఇంకేముంది, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ, పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. తాము చూపించిన వారినే పెళ్లి చేసుకోవాలని ఫిట్టింగ్ పెట్టారు. కానీ, ఆ జంట మాత్రం ఒప్పుకోలేదు. ఇలా రెండేళ్ల వరకూ పోరాడారు. చివరికి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం ఘనంగానే జరిగింది. 45 రోజుల వరకూ అంతా సాఫీగానే సాగింది.

అయితే, ఆ తర్వాతే అమ్మాయి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. భర్త ఇంట్లో కొంత నగదు, నగలు చోరీ చేసి.. తన మాజీ ప్రియుడితో జంప్ అయ్యింది. ఫ్యూజులు ఎగిరిపోయాయి కదూ! మనకే ఇంతలా షాక్ తగిలిందంటే.. పాపం, పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి పరిస్థితేంటి? ఫ్యామిలీతో గొడవ పడి మరీ పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి మాత్రం శఠగోపం పెట్టి మరొకడితో వెళ్లిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here