వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం... ఏమైంది?
May 20,2022 11:27 AM
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో అధికారపార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యంది గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తనతో పాటు డ్రైవర్ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఉదయ్ బాబు సమాచారమిచ్చారు.