`ఎన్టీఆర్` లో విఠలాచార్య ఆయనేనా?
September 26,2018 05:52 PM
`ఎన్టీఆర్` బయోపిక్ లో పాత్రధారులు ఫస్ట్ లుక్ పోస్టర్లతో పిచ్చెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ గా బాలయ్య, చంద్రబాబు గా రానా, ఏఎన్నార్ గా సుమంత్ లుక్స్ ఎలా ఉన్నాయో! ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముగ్గురు ఎవరి పాత్రల్లో వారు ఒరిజినల్ కు అచ్చు గుద్దినట్లే ఉన్నారు. పురందేశ్వరి పాత్రకు నాట్య కళాకారణి హిమాన్సీ కూడా బాగా సూటైంది. సరైన మేకప్ వేస్తే? పురందేశ్వరికి జెరాక్స్ కాపీలా ఉంటుంది. దీంతో ఫస్ట్ లుక్ పోస్టర్స్ కోసమే నందమూరి అభిమానులు ఎంతో క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు.