నిత్యా ఆ ఛాన్స్ మిస్సవ్వడానికి కారణమిదే!
September 24,2018 03:49 PM
మలయాళ కుట్టి నిత్యామీనన్ కెరీర్ ఊహించని ట్రామాలో పడటానికి కారణమేంటి? సౌందర్య తర్వాత సౌందర్య అంత ప్రతిభావంతురాలిగా గుర్తింపు ఉన్న నిత్యా కెరీర్ ఉన్నట్టుండి ఎందుకు డైలెమాలో పడింది? ఇటీవల అభిమానుల్లో ఆసక్తికర చర్చ ఇది. అందుకు ఓ రెండు కారణాల్ని ఫిలింనగర్లో చెప్పుకోవడం చర్చకొచ్చింది.
నిత్యాకు తెలుగు, తమిళ, మలయాళంలో కథానాయికగా మంచి గుర్తింపు వుంది. తను ఏ సినిమా చేసినా అందులో సంథింగ్ వుంటుందని అభిమానుల నమ్మకం. అందుకు తగ్గట్టే నిత్యా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెసయ్యాయి. తొలి సినిమా `అలా మొదలైంది` నుంచి మంచి నటిగా కితాబు అందుకుంది. అయితే కాలక్రమంలో ఎందుకనో నిత్యా రేస్‌లో వెనకబడింది. దీనిపై ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌లో ఆసక్తికర డిబేట్ నడుస్తోంది. నిత్యా గత కొంత కాలంగా ప్రధాన నాయికగా కనిపించకపోవడానికి కారణమేంటి? అంటూ చర్చ సాగుతోంది.
బన్ని `సన్నాఫ్ సత్యమూర్తి`లో సెకండ్ హీరోయిన్గా కనిపించిన నిత్యా, ఆ తరువాత కొరటాల - ఎన్టీఆర్ మూవీ `జనతా గ్యారేజ్`లోనూ అదే తరహా పాత్రలో కనిపించింది. ఆ తరువాత భారీగా ఒళ్లు పెంచి బొద్దుగా మారిపోయింది. సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ రూపొందించిన `మహానటి` కోసం ముందు నిత్యానే అనుకున్నారు. ఏమైందో ఏమో .. చివరి నిమిషంలో మనసు మార్చకున్న చిత్ర బృందం నిత్యాను పక్కనపెట్టి కీర్తిసురేష్‌ను ఖాయం చేసుకున్నారు.
అసలు చివరి నిమిషంలో ఏం జరిగింది? అన్నది ఇన్నాళ్లు సస్పెన్స్. తాజాగా అందుకు కారణమేంటో అత్యంత సన్నిహితుల ద్వారా లీకైంది. నిత్యా అలాంటి క్రేజీ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్న తననే అడిగితే సమాధానం దాటవేస్తోంది. నిత్యా బాగా లావెక్కడమే `మహానటి` ఛాన్స్‌ను వదులుకునేలా చేసిందా? వెతుక్కుంటూ వచ్చిన గోల్డెన్ఛాన్స్ను వదులుకోవడానికి కారణమేంటి? అంటే అంతకుమించి వేరొక కారణం ఉందని తెలుస్తోంది. నిత్య తలబిరుసు వ్యవహారమే ఆ ఛాన్స్ పోవడానికి కారణమని, భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేసిందని ... ఛాన్స్ మిస్సవ్వడానికి ఆ రెండూ కారణమని ముచ్చట సాగుతోంది. అంత ఇంపార్టెంట్ సినిమాని నిత్యా తెలివితక్కువగా వదులుకుందే అంటూ సన్నిహితులే ఆశ్చర్యపోతున్నారట.