మొదట్లోనే యాక్షన్ హీరోగా తన తఢాకా చూపిద్దామనుకొన్న అఖిల్ కోరిక త్వరలో నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. అక్కినేని హీరో అఖిల్ యాక్షన్ హీరోగా ఎదగాలని బలమైన సంకల్ం ఉంది. అది త్వరలోనే తీరుతుంది. అఖిల్ కోసం మాస్, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఒక స్టోరీని రాస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరు చేస్తున్న సినిమాలు పూర్తి చేసుకని ఆ తర్వాత వీరి కాంబోలో సినిమా స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
అయితే వీరి కాంబోలో రాబోయే మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా మొదటి సినిమాతో ఖంగుతిన్న 'అఖిల్' రెండవ సినిమా 'హలో'తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత అఖిల్ మూడో సినిమాగా ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్లో 'మిస్టర్ మజ్ను' అనే సినిమాలో నటిస్తున్నాడు.