`ఎన్టీఆర్` లో విఠలాచార్య ఆయనేనా?
September 26,2018 05:52 PM
`ఎన్టీఆర్` బయోపిక్ లో పాత్రధారులు ఫస్ట్ లుక్ పోస్టర్లతో పిచ్చెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ గా బాలయ్య, చంద్రబాబు గా రానా, ఏఎన్నార్ గా సుమంత్ లుక్స్ ఎలా ఉన్నాయో! ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముగ్గురు ఎవరి పాత్రల్లో వారు ఒరిజినల్ కు అచ్చు గుద్దినట్లే ఉన్నారు. పురందేశ్వరి పాత్రకు నాట్య కళాకారణి హిమాన్సీ కూడా బాగా సూటైంది. సరైన మేకప్ వేస్తే? పురందేశ్వరికి జెరాక్స్ కాపీలా ఉంటుంది. దీంతో ఫస్ట్ లుక్ పోస్టర్స్ కోసమే నందమూరి అభిమానులు ఎంతో క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఎలా ఉంటుందో? ఫేక్ ఊహా చిత్రాలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. తాజాగా సినిమా కు సంబంధించి మరో అప్ డేట్ వెలుగు లోకి వచ్చింది.
ఎన్టీఆర్ ఫేమ్ లో ఉన్నప్పుడు విఠలాచార్య దర్శకత్వంలో చాలా జానపద చిత్రాల్లో నటించారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సినిమాలో ఆ పాత్ర కూడా కీలకం కావడంతో తీసుకున్నట్లు తెలిసింది. ఆ రోల్ కు తెలంగాణ డైరెక్టర్ ఎన్. శంకర్ ను ఎంపిక చేసారుట. ఇప్పటికే ఆయనే షూట్ కు వెళ్తున్నట్లు సమాచారం. ఎన్ శంకర్ గతంలో కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసారు. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో ఖాళీగానే ఉంటున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కరరావు పాత్రలో సచిన్ కేడ్కర్ ను, ఎల్. వి ప్రసాద్ పాత్రలో జిష్షు సేన్ గుప్తా ను తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. వాటిని యూనిట్ ధృవీకరించాల్సి ఉంది.