సామ్ ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తోందా?
September 24,2018 07:56 PM
అక్కినేని కోడలు సమంత సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ..కేవలం స్టోరీ బేస్ డు సినిమాలే కమిట్ అవుతోంది. అందుకే కొత్త కమిట్ మెంట్లు ఆలస్యం అవుతున్నాయి. ప్రస్తుతం తమిళ్ లో `సూపర్ డీలక్స్` సినిమా మినహా ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. ఇటీవలే ఆమె నటించిన `యూ టర్న్` రిలీజైంది. ఇందులో సమంత పాత్రకు మంచి గుర్తింపు...ప్రశంసలు దక్కాయి. అయితే బాక్సాఫీస్ వద్ద కాసులు మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. తాజాగా మరోసారి లేడీ ఓరియేంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. కొరియన్ మూవీ `మిస్ గ్రానీ` తెలుగులో రీమేక్ చేయాలనుకుంటోదట.
ఆ సినిమా దర్శకత్వ బాధ్యతల్ని ప్లాప్ డైరెక్టర్ నందిని రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన `అలా మొదలైంది` మినహా తక్కిన రెండు సినిమాలు `జబర్దస్త్`, `కళ్యాణ్ వైభోగం` డిజాస్టర్లు అయిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా మూడేళ్ల గ్యాప్ లో డైరెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో సామ్ పై విమర్శలు వస్తున్నాయి...తెలిసి...తెలిసి ప్లాప్ డైరెక్టర్ కు సామ్ ఎలా ఛాన్స్ ఇస్తుందంటూ ఫిలిం నగర్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. కాగా `మిస్ గ్రానీ` రీమేక్ రైట్స్ ను సురేష్ బాబు తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే రీమేక్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.