పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఉందా?
September 20,2018 07:28 PM
ప్రస్తుతం టాలీవుడ్ బయోపిక్ లతో ఊగిపోతుంది. ఒక పక్క `ఎన్టీఆర్`..మరోపక్క వైఎస్సార్ `యాత్ర`..ఇంకో పక్క కళా తపస్వి కె. విశ్వనాత్ జీవితం..కత్తి కాంతారావు బయోపిక్...చంద్రబాబు నాయుడు ఇలా అరడజనకు పైగా బయోపిక్స్ సెట్స్ లో ఉన్నాయి. మరికొన్ని బయోపిక్ లకు రంగం సిద్ధమవుతోంది. అయితే వీటన్నింకంటే ముందే బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను ప్రకటించారు. సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆ సినిమా ఉందని తెలిపారు. అయితే ఇప్పటివరకూ ఆ సినిమా సెట్స్ కు వెళ్లలేదు. ఈ లోపు సుధీర్ బాడు మూడు..నాలుగు సినిమాలు చేసి రిలీజ్ చేసాడు. దీంతో ఆ బయోపిక్ ఉందా? క్యాన్సిల్ అయిందా? అని ప్రచారం సాగింది.
తాజాగా `నన్ను దోచుకుందువటే` సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ బయోపిక్ ఉందని మరోసారి క్లారిటీ ఇచ్చాడు సుధీర్ బాబు. డిలేకు కారణాలు చెప్పలేదు గానీ..సినిమా అయితే పక్కాగా ఉందని..దానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడని ఒక్కాణించాడు. మరి ఇదే ఊపులో పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా ప్రారంభమైతే హైప్ వస్తోంది. ఆడియన్స్ కూడా బయోపిక్ బయోపిక్స్ అంటూ కలవరిస్తోన్న సమయం కూడా ఇదే. మరి నన్ను దోచుకుందవటే` సినిమా తో సుధీర్ బాబు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సొంత బ్యానర్లో కంటున్యూస్ గాసినిమాలు చేస్తానని అంటున్నాడు. అందువల్ల నిర్మాత సమస్య కూడా లేదని తెలుస్తోంది. మరి సుధీర్ బాబు -ప్రవీణ్ సత్తారు మనసులో ఏముందో?`