ప్రేమ కోసం మగాడిగా మారిన యువతి...హ్యాండిచ్చిన ప్రియురాలు!
December 25,2018 04:08 PM
ఇప్పుడు మీరు చదవబోయే వార్త కాస్త సినిమా లానే అనిపిస్తుంది ఖంగారుపడకండి, ఎందుకంటే ఇది నిజంగా నిజం ! కేరళలో ఒకే చోట పనిచేసే ఇద్దరు యువతులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. వీరిలో ఓ యువతి తన ప్రియురాలి కోరిక మేరకు ఆమెని పెళ్లి చేసుకోవడం కోసం లింగమార్పిడి చికిత్స చేసుకుని పురుషుడిగా మారింది. అయితే ఆమె పురుషుడిగా మారిన తర్వాత ప్రియురాలు మాత్రం పెళ్లికి నిరాకరించింది. దీంతో మీడియా ముందుకు వచ్చిన సదరు యువకుడు అదేనండీ యువతీ నుండి యువకుడిగా మారిన వ్యక్తి తామిద్దం కలిసి నిర్ణయం తీసుకుని నేను పురుషుడిగా మారితే ఇప్పుడు ఆ యువతి పెళ్లికి నిరాకరిస్తోందని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేరళలోని పెరువాన్నముడికి చెందిన దీపూ ఆర్ దర్శన్ అలియాస్ అర్చనా రాజ్ (23) అనే యువతి రెండు నెలల కిందట లింగమార్పిడి చికిత్స చేయించుకుంది. అనంతరం తన ప్రియురాలిని కలవడానికి వెళ్తే తనకు వేరొకరితో పెళ్లి కుదురిందని, నువ్వెవరో తెలియదని షాక్ ఇచ్చింది. దీనిపై నిన్న కోజికోడ్‌లోని ప్రెస్ క్లబ్లో దీపూ మాట్లాడుతూ వడకారాకు చెందిన తన ప్రియురాలి కోసం రూ.2 లక్షలు ఖర్చుపెట్టి చెన్నైలోని ఓ హాస్పిటల్లో లింగమార్పిడి చేయించుకున్నానని ఇది అందరికీ ఓ జోక్‌లా అనిపించవచ్చు కానీ వాస్తవమేనని, తాను సర్జరీ చేయించుకున్న తర్వాత ప్రియురాలు ముఖం చాటేసిందని వాపోయాడు. ఒకరినొకరం ఇష్టపడటంతో జీవితాంతం కలిసుండాలనే ఉద్దేశంతో పురుషుడిగా నిర్ణయం తీసుకున్నామని దీపు తెలిపాడు. కానీ, ఆమె ఇప్పుడు మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడిందని పేర్కొన్నాడు. దీనిపై తనను నిలదీస్తే మనకు ఎలాంటి సంబంధం లేదని, వెళ్లిపోవాలని బెదిరించిందని దీపూ తెలియజేశారు. అంతేకాదు పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశానని, వారి పిలిపించి మాట్లాడినప్పుడు కూడా తన మానసిక పరిస్థితి సక్రమంగా లేదని ఆరోపించిందని అన్నాడు. వచ్చే నెలలో మరొకరితో వివాహం జరగనుందని చెప్పడంతో న్యాయం కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేశానని వెల్లడించాడు.