ప్రభాస్ ను మించిన కటౌట్ ఇది
November 05,2018 05:20 PM
దేశంలోనే ఇప్పటివరకూ ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం ఆ మధ్య ప్రభాస్ కు అభిమానుల రూపంలో దక్కింది. ప్రభాస్ అభిమానులు బాహుబలి-2 సమయంలో ఆయనకు చెందిన ఓ భారీ కటౌట్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు 100 అడుగులకు పైగా ఓ కటౌట్ ను సిద్దం చేసి థియేటర్ ముందు ప్రదర్శనకు ఉంచారు. ఇది దేశంలోనే అతి పెద్ద కటౌట్ గా రికార్డు సృష్టించింది. దేశంలో చాలా మంది హీరోలున్నారు. కానీ ఏ హీరో అభిమానులు ఇంత భారీ కటౌట్ నిర్మించింది లేకపోవడంతో...ఆ రికార్డు ప్రభాస్ వసమైంది. తాజాగా ఆ రికార్డ్ ను తమిళ హీరో విజయ్ బ్రేక్ చేసాడు. ఆయన కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన `సర్కార్` భారీ ఎత్తున ఈనెల 6న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా కొల్లం నన్బన్ ఫ్యాన్ క్లబ్ అభిమానులు విజయ్ పై అభిమానంతో ఏకంగా 175 అడుగుల భారీ కటౌట్ రూపొందించారు. దీన్ని మలయాళ నటుడు సన్నీ వెయిన్ ఆవిష్కరించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే విజయ్ అభిమానులు సేవా కార్యక్రమాలు కోసం లక్ష విరాళం కూడా ప్రకటించారు. `సర్కార్` వరల్డ్ వైడ్ గా మొత్తం 3000లకు పైగా థీయేటర్లలలో ఈనెల 6 రిలీజ్ అవుతోంది. దీంతో సినిమా తొలి రోజు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.